వ్రతాలు

వరలక్ష్మీ వ్రతం

శ్రావణమాసం అత్యంత విశిష్టమైనదిగా, పవిత్రమైనదిగా చెప్పబడుతున్న నెల. ఈ మాసంలో పన్నమినాడు శ్రవణా నక్షత్రం కూడినందువల్ల శ్రావణమాసంగా పిలువబడుతున్నది. స్త్రీలకు సంతాన సౌభాగ్యాలను ప్రసాదించే నాగుల చవితి, గరుడ పంచమి, మంగళగౌరీ వ్రతాలు, వరలక్ష్మీవ్రతం మున్నగు నోములు, ప్రతాలు ఒనగూడిన నెల శ్రావణమాసం! అందువల్లే స్త్రీలకు అత్యంత ప్రాముఖ్యం కలిగిన నెలగా శ్రావణమాసం ఆచరింపబడుతున్నది. ప్రధానంగా కొత్తగా వివాహమైన నూతన వధువులు తమ తమ సౌభాగ్యశ్రేయస్సుల కోసం శ్రావణమాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతాలు చేస్తారు. ఇలా ఈ నెలలో నాలుగు లేదా ఐదు వారాలుగా వచ్చే ప్రతి మంగళవారంనాడు మంగళగౌరీవ్రతాలతో పాటు అదే శ్రావణమాసంలో పన్నమినాటికి ముందు వచ్చే శుక్రవారంనాడు సకల సిరిసంపదలను కురిపించే శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని కూడ ఆచరిస్తారు. నూతన వధువులు మాత్రమే గాక ఇత
Show More >

సత్యనారాయణ వ్రతం

సత్యనారాయణ వ్రత ప్రారంభం:

ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి,అలికి,బియ్యపు పిండితోగాని,రంగుల చూర్ణములతోగాని,ముగ్గులుపెట్టి,దైవస్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి.పీట మరీ ఎత్తుగాని, మరీ పల్లముగానీ ఉండకూడదు.పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపురాసి,కుంకుంమతో బొట్టు పెట్టి,వరిపిండి (బియ్యపుపిండి) తో ముగ్గు వేయాలి. సాధారణంగా అష్టదళ పద్మాన్నే వేస్తారు.పూజచేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి.ఏ దైవాన్ని పూజింపబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమనుగాని, చిత్రపతమునుగాని, ఆ పీట పై ఉంచాలి.ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి),దానికి కుంకుమ బొట్టు పెట్టి, పిదప ఒక పళ్లెంలోగాని, క్రొత్త తుండు గుడ్డ మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకు నుంచి,అందు పసుపు గణపతినుంచి అగరువత్తులు వెలిగించాలి.ఇ
Show More >

శ్రీ అనంత పద్మనాభస్వామి వ్రతం

పూర్వం పంచపాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో..., వారి యోగక్షేమాలు విచారించాలని శ్రీకృష్ణుడు వారి దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణుని చూడగానే ధర్మరాజు చిరునగవుతో ఎదురేగి స్వాగత మర్యాదలతో సత్కరించి ఉచితాసనం ఇచ్చి గౌరవించాడు. కొంతసేపు కుశలప్రశ్నలు జరిగాక.., కృష్ణా..మేము పడుతున్న కష్టాలు నీకు తెలియనివి కాదు. ఏ వ్రతం చేస్తే మా కస్టాలు తొలగిపోతాయో దయచేసి మాకు ఉపదేశంచ  అని ప్రార్థించాడు ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు  ధర్మరాజా..మీ కష్టాలు తీరాలంటే  అనంత పద్మనాభస్వామి వ్రతం ఆచరించండి  అని సలహా ఇచ్చాడు. అప్పుడు ధర్మరాజు  కృష్ణా..అనంతుడంటే ఎవరు? అని ప్రశ్నించాడు. ధర్మరాజా.. అనంత పద్మనాభుడంటే మరెవ్వరో కాదు, నేనే. నేనే కాలస్వరూపుడనై సర్వం వ్యాపించి ఉంటాను. రాక్షస సంహారం కోసం నేనే కృష్ణునిగా అవతరించాను. సృష్టి, స్థితి, లయ కారణభూతుడైన అనంత పద్మనాభస్వా
Show More >

గౌరీవ్రతం

లక్ష్మిప్రదమైన శ్రావణమాస ప్రారంభానికిముందు వచ్చే అమావాస్య కనుక ఈ రోజు అధికసంఖ్యలో దీపాలను పెట్టి లక్ష్మీదేవిని పూజించడం మంగళప్రదమని ధర్మశాస్త్ర వచనం. అంతేకాక దక్షిణాయనంలో మొదటిది కనుక ఈ దీపప్రజ్జ్వలనతో పితృ దేవతలు కూడా సంతోషిస్తారు.

ఈ రోజున గౌరీవ్రతం ఆచరించే విధానంకూడా చెప్పబడింది. పసుపుముద్దను తయారుచేసి దానియందు గౌరీదేవిని ఆవహింప జేసి షోడశోపచార పూజలుచేసి కుడుములు నైవేద్యముగా పెట్టవలెను. పూజలో భాగంగా రెండు రక్షలను తయారుచేసి ఒకటి గౌరీదేవికి సమర్పించి మరొకటి చేతికి ధరించాలి. కన్యలు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వివాహం జరిగే ఆస్కారం ఉంది. వివాహితలకు సౌభాగ్యప్రదం.


Show More >