మా గురించి

మా గురించి

అతి పతివ్రమైన హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న మానస సరోవరం వద్ద ఒక పర్ణశాలను నిర్మించుకుని అక్కడే శివుని గురించి తపస్సు చేయడం ఆరంభిస్తాడు. నారదుడు త్రిలోక సంచారి. ఆయనకు తగువులమారి, కలహాభోజనుడు ఇత్యాది పేర్లున్నా ఆయన చేసే పనులన్నీ చివరకు జగత్కల్యాణంగా పరిణమించడంతో అందరూ ఆయన్ను ముందు ఆడిపోసుకున్నా అనతంరం మాత్రం ఎంతగానో కొనియాడతారు. అటువంటి నారదుడు తపస్సు చేయడం మొదలుపెట్టేసరికి స్వర్గాధిపతి అయిన ఇంద్రునికి భయం పట్టుకుంది.
 
సాధారణంగా లోకంలో ఎవరన్నా తపస్సు ప్రారంభించారంటే ముందు భయపడేది దేవేంద్రుడు. ఎందుకంటే తన పదవికి ఎక్కడ గండం వస్తుందోనని ఆయనకు వెరపు. ఇప్పుడు కూడా అదే భయంతో నారదుని తపస్సు చెదరగొట్టేందుకు తన రాచసభలో నాట్యం సాగించే సౌందర్యరాశులైన రంభ, ఊర్వశి, మేనక మొదలైన అప్సరసల్ని భూలోకానికి పంపిస్తాడు. ఎలాగైనా నారదుడి తపస్సును భగ్నం చెయ్యమని వాళ్ళను ఆదేశిస్తాడు. ఇంద్రుని ఆజ్ఞ మేరకు ఆ నారీమణులంతా నారదుడు తపస్సు చేస్తున్న ప్రాంతానికి రాయంచల్లా చేరుకుంటారు. తమ నటనాప్రావీణ్యంతోనూ, సౌందర్య ఆకర్షణతోనూ ఆయన దృష్టిని తపస్సు నుంచి మరల్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. చివరకు తమ వంపుసొంపుల్నిసైతం ఏకాకి, ఆజన్మ బ్రహ్మచారి అయిన నారదుని మేనుకు తగిలేలా నాట్యం చేస్తూ అతనిలో శృంగార పిపాసను రేకెత్తించేందుకు పూనుకుంటారు.